Fri Dec 05 2025 12:02:26 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య 108వ సినిమా అప్డేట్ వచ్చేసింది..!
నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. 107వ సినిమాను పూర్తీ చేసే పనిలో ఉన్న బాలయ్య బాబు..త్వరలో 108వ సినిమాను మొదలుపెట్టనున్నాడు. అనిల్ రావిపూడితో ఈ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోను వదిలారు. పవర్ఫుల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందనున్న విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పేశారు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇదివరకెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నారని చిత్ర యూనిట్ చెప్పింది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న ఎన్బీకే 107 షూటింగ్ జరుపుకుంటోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
News Summary - NATA SIMHAM NandamuriBalakrishna garu in a never before role
Next Story

