Thu Dec 18 2025 10:11:06 GMT+0000 (Coordinated Universal Time)
నారా రోహిత్ వినూత్న నిరనస
చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సినీ హీరో నారా రోహిత్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సినీ హీరో నారా రోహిత్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నారావారిపల్లెలో పూర్వీకుల సమాధి వద్ద నారా రోహిత్ నిరసన తెలిపారు. చంద్రబాబు తల్లిదండ్రులు అమ్మణమ్మ, కర్జూర నాయుడు సమాధుల వద్ద నిరసన తెలిపారు.
తాతల సమాధి వద్ద....
సమాధుల వద్ద కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. తన పెద్దమ్మ ఏనాడు గడప దాట లేదని, క్రమశిక్షణకు మారుపేరు నందమూరి ఫ్యామిలీ అని నారా రోహిత్ అన్నారు. తాము ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఇటువంటి ఆరోపణలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నారా రోహిత్ హెచ్చరించారు.
Next Story

