Fri Jan 30 2026 20:50:19 GMT+0000 (Coordinated Universal Time)
ఆకట్టుకుంటున్న "నన్ను దోచుకుందువటే" ఫస్ట్ లుక్

సమ్మెహనం లాంటి మంచి విజయంతో దూకుడు మీద ఉన్న సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే .. విభిన్నమైన కోణంలో, కొత్త స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం మెదటి లుక్ ని విడుదల చేశారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తారు.
Next Story

