Sat Dec 07 2024 19:44:36 GMT+0000 (Coordinated Universal Time)
మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా, బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎంట్రీ ఇస్తారన్న ప్రశ్నకు బాలయ్య ఎప్పటికప్పుడు దాట వేస్తూ వస్తున్నారు.
ఫస్ట్ లుక్ విడుదల కావడంతో...
కానీ నిన్న ఫస్ట్ లుక్ విడుదల కావడంతో నందమూరి వారసుడు మరొకరు చిత్ర రంగ ప్రవేశానికి సిద్ధమయినట్లే. బాలయ్య అభిమానులు వినాయక చవితి పండగతో పాటు ఈ న్యూస్ ను కూడా పండగ చేసుకుంటున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా దీనిని రూపొందించనున్నట్లు ప్రశాంత వర్మ తెలిపారు. మరి బాలయ్య కొడుకా? మజాకా? అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తో సహా అనేక మంది హీరోలు మోక్షజ్ఞ ఎంట్రీని స్వాగతిస్తూ ట్వీట్లు చేశారు.
Next Story