Thu Mar 19 2026 07:23:56 GMT+0530 (India Standard Time)
బాలయ్యకు మనవళ్ల స్పెషల్ గిఫ్ట్
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. తన తన మనవళ్లతో గడిపారు

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఈరోజు కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనేక చోట్ల రక్తదానాలు చేశారు. బాలయ్య కూడా బసవతారకం ఆసుపత్రికి వెళ్లి అక్కడ సిబ్బందితో తన పుట్టినరోజు వేడుకలను ఉదయం జరుపుకున్నారు. పుట్టినరోజున బాలయ్య హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉన్నారు.
ఇంట్లోనే ఉండి వారితో....
అయితే ఈ పుట్టిన రోజుకు బాలయ్య తన మనవళ్లతో గడిపారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో తన పుట్టినరోజు అయిన వెంటనే ఇంట్లోనే ఉండి మనవళ్లతో గడిపారు. తన ఇద్దరు కూతుళ్ల ముద్దుల కుమారులు బాలయ్యకు ఈ సందర్భంగా బాలయ్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. వారితో ఆడుకుంటూ తన పుట్టినరోజు వేడుకలను వైరైటీగా ఈ ఏడాది జరుపుకున్నారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story

