Sun Mar 15 2026 13:27:04 GMT+0530 (India Standard Time)
విలపించిన బాలయ్య
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవ దేహాన్ని చూసి నందమూరి బాలకృష్ణ కన్నీటి పర్యంత మయ్యారు

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవ దేహాన్ని చూసి నందమూరి బాలకృష్ణ కన్నీటి పర్యంత మయ్యారు. ఆయనకు తనతో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఫిలింఛాంబర్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవ దేహానికి బాలకృష్ణ నివాళుర్పించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయనతో అనుబంధం....
సిరివెన్నెల మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని బాలకృష్ణ తెలిపారు. పుట్టిన నేలకు వన్నె తెచ్చిన మహా వ్యక్తి అని బాలకృష్ణ కొనియాడారు. తాను సిరివెన్నెలను కలసినప్పుడల్లా సాహిత్యంపైనే మాట్లాడుకునే వారమని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు.
Next Story

