Sun Mar 15 2026 17:25:57 GMT+0530 (India Standard Time)
కృష్ణ తప్పకుండా మళ్లీ పుడతారు
డేరింగ్ అండ్ డేషింగ్ హీరో అన్న పేరు ఆయనకు ఖచ్చితంగా సరిపోతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు

డేరింగ్ అండ్ డేషింగ్ హీరో అన్న పేరు ఆయనకు ఖచ్చితంగా సరిపోతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎన్నో చిత్రాలకు పనిచేశారన్నారు. మంచి చిత్రాలను ప్రజలకు అందించారన్నారు. మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. తెలుగు జాతి కృష్ణ మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిందన్నారు.
ఇద్దరిదీ ఒకటే తీరు...
కృష్ణా మళ్లీ పుడతారని బాలకృష్ణ ఆకాంక్షించారు. తన తండ్రి ఎన్టీఆర్ కు, కృష్ణకు మధ్య ఎంతో సారూప్యం ఉందని అన్నారు. నిర్మాతలకు అండగా నిలబడతారని అన్నారు. వారికి సహకరిస్తూ వారు నష్టపోకుండా చూస్తారన్నారు. కొత్త నిర్మాతలను చిత్రపరిశ్రమకు పరిచయం చేయడం జరిగిందన్నారు. ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. బాలకృష్ణ తన భార్య, కుమార్తెలతో కలసి కృష్ణ భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. మహేష్ బాబు కుటుంబాన్ని ఓదార్చారు.
Next Story

