Sat Apr 01 2023 23:03:23 GMT+0000 (Coordinated Universal Time)
సారీ చెప్పిన బాలయ్య
నర్సులపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని నందమూరి బాలకృష్ణ తెలిపారు

నర్సులపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని నందమూరి బాలకృష్ణ తెలిపారు. నర్సుల మనోభావాలు దెబ్బతిన్నాయంటే తాను పశ్చాత్తాపం ప్రకటిస్తున్నానని తెలిపారు. రాత్రింబవళ్లూ రోగులకు సపర్యలు చేసే నర్సులంటే తనకెంతో గౌరవమని నందమూరి బాలకృష్ణ అన్నారు. పవన్ కల్యాణ్ తో జరిగిన అన్స్టాపబుల్ షోలో నర్సులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నర్సుల సంఘాలు డిమాండ్ చేశాయి.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు..
అయితే తాను నర్సులను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రాణాలు నిలిపి, ఊపిరి పోసే వారిని తాను ఎన్నడూ కించపర్చనని తెలిపారు. వారంటే తనకెంతో ప్రేమ అని బాలకృష్ణ అన్నారు. రోగులకు సేవలందించే సోదరీమణుల పట్ల తనకు ఎప్పుడూ గౌరవముంటుందని బాలకృష్ణ తెలపారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు మరువలేవని అన్నారు.
Next Story