Fri Dec 19 2025 02:21:22 GMT+0000 (Coordinated Universal Time)
ఏం జరుగుతుందో చూద్దాం.. బాలయ్య కామెంట్స్
అఖండ సినిమాను సినిమా టిక్కెట్ల ధరలపై హైకోర్టు తీర్పు రాకముందే విడుదల చేశామని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

అఖండ సినిమాను సినిమా టిక్కెట్ల ధరలపై హైకోర్టు తీర్పు రాకముందే విడుదల చేశామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయినా సినిమా విజయవంతమయిందని తెలిపారు. ప్రభుత్వం తీర్పుపై అప్పీల్ కు వెళ్తామంటుందని, ఏం జరుగుతుందో చూద్దామని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అన్నింటికి సిద్ధమయ్యే అఖండ సినిమాను విడుదల చేశామని, ప్రేక్షకులు ఆదరించారని బాలకృష్ణ తెలిపారు.
దుర్గగుడిలో పూజలు....
విజయవాడలోని దుర్గగుడిని బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను దర్శించుకున్నారు. అఖండ సినిమా విజయవంతమైనందుకు ప్రత్యేక పూజలు నిర్వహింాచారు. కాసేపట్లో బాలయ్య బోయపాటి శ్రీను ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి శ్రీకాళహస్తి, తిరుమల చేరుకుంటారు.
Next Story

