Fri Dec 05 2025 14:01:06 GMT+0000 (Coordinated Universal Time)
Akhanda : బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... నందమూరి అభిమానులకు నిజంగా పండగే
నందమూరి బాలకృష్ణ అభిమానులకు దసరా పండగ రోజున గుడ్ న్యూస్ అందింది.

నందమూరి బాలకృష్ణ అభిమానులకు దసరా పండగ రోజున గుడ్ న్యూస్ అందింది. అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన విడుదల కానునన్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో అఖండ 2 మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి. అఖండ మూవీ ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని మేకర్స్ చెపుతున్నారు. బాలయ్య అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఈ సినిమాతో మరింత హైరేంజ్ కు చేరుకున్నాయి.
డిసెంబరు 5వ తేదీన...
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. అఖండ మూవీ ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ అదరగొట్టాడు. దీంతో నందమూరి తమన్ అంటూ ముద్దుగా పిలుచుకునే స్థాయికి వచ్చారు. ఈ సినిమాకు కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఓటీటీ హక్కులు రికార్డు స్థాయిలో...
త్రిశూలంతో గర్జించిన బాలయ్య పోస్టర్ బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్సాహం రేపింది. సోషల్ మీడియాలో ఆ పోస్టర్ వైరల్ అవుతోంది. ఎస్. థమన్ అందిస్తున్న సంగీతం, బోయపాటి మాస్ స్టయిల్ కలిసిపోవడంతో అఖండ 2 విజువల్ గ్రాండ్‌గా ఉండబోతోందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అఖండ 2 మూవీ ఓటీటీ హక్కులు కూడా రికార్డు స్థాయిలో 80 కోట్ల రూపాయలకు మేరకు అమ్ముడయినట్లు వస్తున్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Next Story

