Fri Dec 05 2025 22:46:12 GMT+0000 (Coordinated Universal Time)
తారకరత్నను చూసి కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ
తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. నటనలోనూ తనను..

నందమూరి తారకరత్న(39) మరణం నందమూరి కుటుంబంలో, అభిమానుల్లో, ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తారని అందరూ భావించారు. కానీ.. ఆయన 23 రోజులుగా కోమాలో ఉండి.. ఫిబ్రవరి 18న కన్నుమూశారు. తారకరత్న మృతితో.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇక బాలకృష్ణ అయితే.. తారకరత్నను తలచుకుని కుమిలిపోతున్నారు.
"బాల బాబాయ్" అంటూ తనను ఆప్యాయంగా పిలిచేవాడని, ఆ పిలుపు ఇక వినబడదన్న ఊహను తట్టుకోలేకపోతున్నానని అన్నారు. తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. నటనలోనూ తనను తాను నిరూపించుకున్నాడని బాలయ్య అన్నారు. గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడాడని, పూర్తిగా కోలుకుని మృత్యుంజయుడిలా తిరిగి వస్తాడని ఆశించామన్నారు. కానీ.. తారకరత్న తామందరినీ ఇలా వదిలేసి వెళ్లిపోతాడని ఊహించలేదని పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Next Story

