Sat Dec 07 2024 23:42:24 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి అఖండ.. ఎప్పుడు ? ఎందులో ?
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ ఓటీటీలో భారీ మొత్తానికి కొనుగోలు చేశారు
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం అఖండ. ఈ సినిమా విడుదలై అప్పుడే వారంరోజులైనా.. బాక్సాఫీస్ వద్ద అఖండ కలెక్షన్లు రాబడుతోంది. తొలి ఆరు రోజుల్లో ఈ సినిమా రూ.85 కోట్లు వసూలు చేసింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమా ఇదేనని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించగా, ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా నటించి, తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. శ్రీకాంత్, పూర్ణ, ప్రభాకర్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.
న్యూ ఇయర్ కు....
ఈ సినిమా కొత్త సంవత్సరం కానుకగా ఓటీటీలో విడుదల కాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి కొనుగులు చేసిందట. 2022, జనవరి 1 లేదా 2వ తేదీల్లో అఖండ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వనుంది. థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పించిన ఈ సినిమా.. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట్లోనూ రచ్చ చేయనుంది.
Next Story