Fri Dec 05 2025 15:46:55 GMT+0000 (Coordinated Universal Time)
నటి కంగనాపై నాంపల్లి కోర్టు...?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్డు ఆదేశించింది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్డు ఆదేశించింది. ఇటీవల కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఒకరు కోర్టును ఆశ్రయించారు. దేశ స్వాతంత్ర్యం మీద కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని అగౌరవపర్చేలా ఉన్నాయని న్యాయవాది తన పిటీషన్ లో పేర్కొన్నారు. వ్యాఖ్యలపై దుమారం రేగినా తన వ్యాఖ్యలను కంగనా రనౌత్ సమర్థించుకున్నారు.
దేశ స్వాతంత్ర్యంపై.....
కంగనా రనౌత్ 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని చేసిన వ్యాఖ్య..లు కలకలం రేపాయి. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమండ్ పెరుగుతోంది. ప్రతి చోటా ఆమెపై కేసు నమోదవుతుంది. హైదరాబాద్ లోనూ కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు.
- Tags
- kangana ranaut
Next Story

