నభ నటేష్ స్మార్ట్ ఆన్సర్
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరోయిన్స్ నభ నటేష్, నిధి అగర్వాల్ లక్కు మార్చేసింది. నిధి అగర్వాల్ సంగతి ఎలా ఉన్నా నభ [more]
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరోయిన్స్ నభ నటేష్, నిధి అగర్వాల్ లక్కు మార్చేసింది. నిధి అగర్వాల్ సంగతి ఎలా ఉన్నా నభ [more]
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరోయిన్స్ నభ నటేష్, నిధి అగర్వాల్ లక్కు మార్చేసింది. నిధి అగర్వాల్ సంగతి ఎలా ఉన్నా నభ నటేష్ మాత్రం అవకాశాలతో దూసుకుపోతుంది. ఇస్మార్ట్ శంకర్ తో తిక్క తెలంగాణ పోరిగా, గ్లామర్ గా రెచ్చిపోయిన నభ నటేష్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ లోను నభానే హీరోయిన్. అంతేకాకుండా నితిన్ అంధధూన్ రీమేక్ లోను నభ నటేష్ హీరోయిన్ గా ఎంపికైంది.
ప్రస్తుతం అవకాశాల వెల్లువలో దూసుకుపోతున్న నభ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ ప్రమోషన్స్ ని సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తున్న నభ నటేష్ కి ఓ ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే.. కరోనా కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారు. మరి స్టార్స్ అందరూ తమ తమ పారితోషకాలు తగ్గించుకుంటే బావుంటుంది.. నిర్మాతలు సేవ్ అవుతారని అంటున్నారు.. మీరు ఎంత పారితోషకం తగ్గించుకోబోతున్నారు అని అడగగానే ఈ ఇస్మార్ట్ పోరి నభ తిక్క సమాధానం చెప్పింది. అదేమిటంటే.. కరోనా వలన స్టార్స్ పారితోషకం తగ్గించుకోవాలా.. నాకు తెలియదే.. మా మేనేజర్ ని అడిగి చెబుతాను అంటూ స్మార్ట్ గా సమాధానం చెప్పి షాకిచ్చింది