సర్ప్రైజ్ డాన్స్ లు కూడా వుంటాయి!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే దేశభక్తికి చిరునామా మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని అత్యంత గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునేలా ఈ సమ్మర్ ని తన నటనతో కూల్ చేసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు ఏ సర్టిఫికేట్ తో మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ ప్రత్యేక అతిధిగా.....
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..... ‘‘మా చిత్రం నాపేరు సూర్య చిత్రానికి మెదటినుండి పాజిటివ్ బజ్ వస్తుంది. మెము రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ దగ్గరనుండి అందరిలో ఈ చిత్రం చూడాలనే ఆశక్తి డబులవుతుంది. ఈచిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ట్రేడ్ లో ఇప్పటికే బజ్ చాలా హై రేంజి లో వుండటం చాలా ఆనందంగా వుంది. రంగస్థలం చిత్రం తో హాట్ సమ్మ ర్ ని కూల్ చేసిన మన చిట్టిబాబు.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వస్తున్నారు. ఇది మెగా అభిమానులకు పండగరోజు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇటీవల మిలట్రీ మాధవరం లో ఆడియో ఫంక్షన్ చేసుకున్నాం. ఆక్కడి ప్రజలు, అక్కడి సైనికులు వారి కుటుంబాలు మాకు ఇచ్చిన స్వాగతం మరవలేం. అంతగొప్ప ఊరులో మా ఫంక్షన్ చేయటం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. మా హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కి అక్కడి వారంతా ఘనస్వాగతం పలికారు. ఆయన కూడా వారందర్ని ప్రేమతో పలకరించారు. మా చిత్రం లో అల్లు అర్జున్ సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా తనను తాను మలచుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. సర్ప్రైజ్ డాన్స్ లు కూడా వుంటాయి. ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో సర్ప్రైజ్ లు వున్నాయి. అలాగే మా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా సర్‌ప్రైజస్ చాలా వున్నాయి.. అత్యంత భారీ ఈవెంట్ గా చేస్తున్నాం. అలాగే ఈ ఫంక్షన్ కి మెగా అభిమానులు అత్యంత భారీ సంఖ్యలో హజరవుతున్నారు. ఏప్రిల్ 29న గ్రాండ్ ఈవెంట్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా వుంటుంది. మే 4 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది’’.. అని అన్నారు