Wed Jan 21 2026 03:57:53 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ ను వెంటాడుతోన్న కరోనా.. తమన్ కు పాజిటివ్ !
తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కరోనా బారినపడ్డారు. తాజాగా చేయించుకున్న

టాలీవుడ్ ను కరోనా వెంటాడుతోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. నిన్న సూపర్ స్టార్ మహేష్, మంచులక్ష్మి ప్రసన్న లు తాము కోవిడ్ బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే హీరో నితిన్ భార్యకు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో.. ఆమె బర్త్ డే ను దూరంగానే ఉండి ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేశాడు నితిన్.
Also Read : టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవేందర్ సస్పెండ్
తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కరోనా బారినపడ్డారు. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో తమన్ కు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని తమన్ సూచించారు.
Next Story

