Sat Dec 06 2025 02:31:01 GMT+0000 (Coordinated Universal Time)
సంచలన ప్రకటన చేసిన బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్
ఆర్ఎస్ఎస్ పై సినిమా తీసేందుకు కథ రెడీ చేసినట్లు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకూ తనకు ఆర్ఎస్ఎస్ పై..

ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఆర్ఎస్ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్ మాధవ్ రచించిన ది హిందూత్వ పారడైమ్ అనే పుస్తక లాంచింగ్ కార్యక్రమాన్ని విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ పై సినిమా తీసేందుకు కథ రెడీ చేసినట్లు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకూ తనకు ఆర్ఎస్ఎస్ పై అంతమంచి అభిప్రాయం లేదన్నారు. కానీ.. కొందరు ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయాలని తన వద్దకు వచ్చినపుడే దాని గురించి తెలుసుకునేందుకు మెయిన్ బ్రాంచ్ అయిన నాగ్ పూర్ వెళ్లారట. అక్కడ ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానన్నారు విజయేంద్రప్రసాద్.
ఆర్ఎస్ఎస్ తాను చేసే మంచిపనుల గురించి పెద్దగా చెప్పుకోదు.. కానీ అవి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను రాసిన కథను మోహన్ భగత్ కు వినిపించగా.. త్వరలోనే సినిమా తీద్దామన్నారన్నారు. ఆర్ఎస్ఎస్ పై సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా తీయనున్నట్లు విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.
Next Story

