Fri Dec 19 2025 02:27:53 GMT+0000 (Coordinated Universal Time)
Samantha : సమంత మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ సమాధానం వింటే?
సినీ నటి సమంత సంచలన కామెంట్స్ చేశారు

సినీ నటి సమంత సంచలన కామెంట్స్ చేశారు. మీరు సింగిల్ గా ఉండటానికి ఇష్టపడతారా? అన్న జర్నలిస్ట్ ప్రశ్నకు నో అని సమాధానం ఇవ్వడంతో ఆమె మళ్లీ ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అనడానికి కారణమయిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సిటాడెల్, హన్నీ బన్నీ ప్రమోషన్లలో భాగంగా నేషనల్ మీడియాతో సమంత మాట్లాడారు.
జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు...
ఈ సందర్భంగా జర్నలిస్టులు పలు ప్రశ్నలు సంధించారు. మీరు మళ్లీ ఐటమ్ సాంగ్ చేస్తారా? అన్న ప్రశ్నకు లేదు అని స్పష్టమైన సమాధానమిచ్చిన సమంత మీరు సింగిల్ గా ఉండానికి ఇష్టపడతారా? అన్న ప్రశ్నకు నో అని వెంటనే సమాధానం చెప్పారు. దీంతో ఆమె పెళ్లి చేసుకుంటారా? లేక రిలేషన్షిప్ లో ఉండబోతున్నారా? అన్న కోణంలో సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
Next Story

