Thu Dec 11 2025 04:56:24 GMT+0000 (Coordinated Universal Time)
అఖండ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేపు అఖండ సినిమా విడుదల కానుంది.

రేపు అఖండ సినిమా విడుదల కానుంది. దీంతో అఖండ 2 టిక్కెట్లు ధరలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షో ధర కు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14 తేదీ వరకు మల్టీప్లెక్స్ లు 100 రూపాయలు, సింగిల్ థియేటర్ 50 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.
టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు...
అయితే ఇదే ఉత్తర్వుల్లో కార్మిక సంఘాల సంక్షేమం కోసం ఆదాయంలో ఇరవై శాతం నిధులను ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అఖండ మూవీ విడుదల కావాల్సి వచ్చింది. న్యాయపరమైన, సాంకేతిక అంశాలతో అఖండ 2 సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు ప్రీమియర్ షోకు బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను ప్రీమియర్ షోకు టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
Next Story

