Fri Dec 05 2025 21:51:59 GMT+0000 (Coordinated Universal Time)
RRR ఓ మాస్టర్ పీస్.. మెగాస్టార్ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. RRR ఒక మాస్టర్ పీస్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు

RRR సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. సినీ విమర్శకుల ప్రశంసలను పొందింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనతో పాటు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ పైన ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమౌళి టేకింగ్ హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ ఫఇదా అవుతున్నారు. ప్రతి ఫ్రేమ్ ఫీస్ట్ లా ఉందని సంబర పడిపోతున్నారు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి RRR మూవీ చూసి దానిపై ట్వీట్ చేశారు.
సినిమాటిక్ విజన్ కు....
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. RRR ఒక మాస్టర్ పీస్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాజమౌళి అసమాన ప్రతిభకు, సినిమాటిక్ విజన్ కు ఈ సినిమా ఒక సాక్ష్యమని చిరంజీవి ప్రశంసించారు. RRR చిత్ర బృందానికి హాట్సాఫ్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Next Story

