Sun Feb 01 2026 21:03:31 GMT+0000 (Coordinated Universal Time)
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న : చెర్రీకి "చిరు" విషెస్
ఈ సందర్భంగా తండ్రి చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది నాన్న.

మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన నట వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. నేడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నేడు చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రి చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది నాన్న. హ్యాపీ బర్త్ డే అంటూ చరణ్ ను ముద్దాడుతున్న ఫొటోని పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చరణ్ ఫ్యాన్స్.. బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. నిన్న రామ్ చరణ్ కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయగా.. ఆ పాటలకు ఫ్యాన్సంతా థియేటర్లో రచ్చ చేశారు.
కాగా.. చిరుతతో కెరీర్ ప్రారంభించిన చరణ్.. ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. రాజమౌళి మగధీర సినిమాతో.. స్టార్ హీరో అయ్యాడు. ఇప్పటి వరకూ చరణ్ 15 సినిమాల్లో నటించగా.. ఇండస్ట్రీకి నాలుగు హిట్ సినిమాలను అందించాడు. చిరుత, మగధీర, ధృవ, ఆర్ఆర్ఆర్ సినిమాలు చరణ్ కెరీర్ ను నిలబెట్టాయనడంలో సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. చరణ్, ఎన్టీఆర్ ల స్టార్ డమ్ ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ముందు అమెరికాలోని పలు పాపులర్ షో లలో చరణ్ పాల్గొన్నారు.
Next Story

