Thu Dec 18 2025 07:37:08 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మా కలవలేకపోతున్నా.. చిరు ఎమోషనల్ పోస్ట్
పుట్టిన రోజున తన తల్లిని కలవలేక పోతున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. రేపు చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు. అయితే చిరంజీవకి ఇటీవల కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో పుట్టిన రోజున తన తల్లిని కలవలేక పోతున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. అమ్మా నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్ లో ఉన్నందున కలవలేకపోతున్నానిని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
తల్లి పిలిచే పేరు మీదే....
క్వారంటైన్ లో ఉన్నందున కలవలేకపోతున్నానని, ప్రత్యక్షంగా కలసి ఆశీస్సులు తీసుకోలేక పోతున్నానని చిరంజీవి అన్నారు. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకు కూడా కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అమ్మా నీకు జన్మ దిన శుభాకాంక్షలు ఇట్లు శంకర్ బాబు అని పెట్టారు. చిరు సొంత పేరు శివశంకర్ వరప్రసాద్. ఆయన తల్లి ముద్దుగా శంకరబాబు అని పిలవడం అలవాటు. అందుకే శంకరబాబు పేరిట ఈ పోస్టు చేశారు.
- Tags
- chiranjeevi
- tweet
Next Story

