Sun Mar 15 2026 11:54:32 GMT+0530 (India Standard Time)
వరద బాధితలకు మెగా విరాళం
మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వరద బాధితులకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వరద బాధితులకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ విరాళాన్ని పంపుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు యాభై లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షల రూపాయల వంతున సాయం అందిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.
రెండు రాష్ట్రాలకు...
రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా దారుణంగా నష్టపోయాయి. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అందులోనూ బెజవాడ ఇప్పట్లో కోలుకోలేని విధంగా తయారయింది. ఇవన్నీ చూసి తన మనసు చలించిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
Next Story

