సాహోనే హిట్ చేశారు… కానీ సై రా ని
యాక్షన్ మూవీ సాహో ని బాలీవుడ్ జనాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ….. నెత్తిన పెట్టుకుని మరీ హిట్ చేశారు. కానీ హిట్ టాక్ తెచ్చుకున్న సై రా [more]
యాక్షన్ మూవీ సాహో ని బాలీవుడ్ జనాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ….. నెత్తిన పెట్టుకుని మరీ హిట్ చేశారు. కానీ హిట్ టాక్ తెచ్చుకున్న సై రా [more]

యాక్షన్ మూవీ సాహో ని బాలీవుడ్ జనాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ….. నెత్తిన పెట్టుకుని మరీ హిట్ చేశారు. కానీ హిట్ టాక్ తెచ్చుకున్న సై రా నరసింహారెడ్డి సినిమాకి హిందీ ప్రేక్షకులు చుక్కలు చూపెడుతున్నారు. సై రా సినిమాకి ఫస్ట్ షోకే హిట్ టాక్ పడింది. అయినప్పటికీ సై రా సినిమాని చూడడానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. సై రా వసూళ్లు చూస్తుంటే… ఆ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఎంత హేట్ చేస్తున్నారో చూసి ఆ సినిమాని భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నోటా మాటరావడం లేదు.
బాహుబలి రేంజ్ ఉన్న సై రా సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఓ యాక్షన్ మూవీ వార్ కోసం పక్కనబెట్టారంటే నమ్మలేకపొతున్నారు. ట్రేడ్ వర్గాల సైతం సై రా బాలీవుడ్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అమితాబ్ లాంటి మెగాస్టార్ సై రా లో నటించినప్పటికీ… సై రాని బాలీవుడ్ ప్రేక్షకులు చిన్న చూపు చూస్తున్నారంటే ఎవరి నోటా మాట రాని పరిస్థితి. మొదటి రోజు, రెండో రోజు మూడో రోజు సై రా కి హిందీలో ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ శని,ఆదివారాల్లో ఏమైనా సై రా బాలీవుడ్ లో పుంజుకుంటుందేమో చూడాలి.

