Mon Dec 08 2025 20:20:20 GMT+0000 (Coordinated Universal Time)
శివశంకర్ మాస్టార్ కు "చిరు" సాయం
కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు.

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. శివశంకర్ మాస్టార్ కటుంబానికి కరోనా సోకి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మొత్తం కరోనా బారిన పడటంతో శివశంకర్ మాస్టార్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆసుపత్రి ఫీజులు కూడా కట్టలేక సతమతమవుతుంది.
మూడు లక్షలు....
వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శివశంకర్ మాస్టార్ కు చిరంజీవి అండగా నిలిచారు. ఆయన చిన్న కుమారుడు అజయ్ ను పిలిపించుకుని మూడు లక్షల రూపాయలు సాయం చేశారు. శివశంకర్ మాస్టార్ద చిరంజీవి సినిమాలకు కూడా కొరియో గ్రఫీ చేశారు. చిరంజీవికి మాస్టార్ చిన్న కుమారుడు అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్నారని ఆయన అన్నారు. ఆయనచేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనని అన్నారు.
Next Story

