Mon Dec 08 2025 11:08:12 GMT+0000 (Coordinated Universal Time)
భీమిలిలో చిరు ఇంటి స్థలం విలువ ఎంతో తెలుసా?
త్వరలో తాను విశాఖ వాసిగా మారుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విశాఖలో స్థిరపడటం తన చిరకాల వాంఛ అని అన్నారు

త్వరలో తాను విశాఖ వాసిగా మారుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విశాఖలో స్థిరపడటం తన చిరకాల వాంఛ అని ఆయన తెలిపారు. వాల్లేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. విశాఖలో స్థిరపడాలన్నది తన చిరకాల కోరిక అని తెలిపారు. మెట్రోపాలిటిన్ సిటీ మాత్రమే కాకుండా, మంచి మనసున్న వ్యక్తుల మధ్య జీవించాలన్నది తన ఆకాంక్ష అని ఆయన తెలిపారు.
సముద్రానికి ఎదురుగా...
ఇప్పటికే తాను భీమిలీలో ఇంటి కోసం స్థలాన్ని కోసం కొనుగోలు చేశానని చెప్పారు. నిర్మాణం జరగాల్సి ఉందని తెలిపారు. నిర్మణం పూర్తయిన వెంటనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని ఆయన తెలిపారు. సముద్రానికి సమీపంగా ఉన్న స్థలాన్ని చిరంజీవి కొనుగోలు చేసినట్లు తెలిపారు. తనకు విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నానని ఆయన చెప్పడంతో విశాఖలో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం కోట్ల రూాపాయల విలువ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు
Next Story

