Sat Dec 07 2024 01:23:01 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : పద్మవిభూషణ్ ను అందుకున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము చేతులు మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతిభవన్ లో పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి కుమార్తెలతో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కుటుంబ సభ్యులతో కలసి...
చిరంజీవితో పాటు వైజయంతి మాలకు కూడా పద్మవిభూషణ్ అవార్డును అందించారు. చిరంజీవి కుటుంబ సభ్యులు ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్ననే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డు అందుకున్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వందనాలు తెలిపయేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Next Story