Mon Dec 08 2025 10:56:43 GMT+0000 (Coordinated Universal Time)
అవసరమైనప్పుడే భుజం కాస్తా.. మెగాస్టార్ కీలక కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పెద్దరికం అనుభవించాలని లేదని తెలిపారు

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పెద్దరికం అనుభవించాలని లేదని, తన కంటే పెద్దవాళ్లు ఇండ్రస్ట్రీలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను పెద్దోడిని కాదని తెలిపారు. అవసరమైనప్పుడు భుజం కాస్తానని తెలిపారు. తనకు పెద్దరికం అనుభవించాలని లేదన్నారు.
దేవుడు ఎక్కువే ఇచ్చాడు...
తనను ఇండ్రస్ట్రీలో అందరూ పెద్దోడు అని అంటున్నారని, తాను మాత్రం అలా భావించడం లేదని తెలిపారు. తనకు కోరుకున్న దానికంటే దేవుడు ఎక్కువే ఇచ్చాడని చిరంజీవి అన్నారు. సమస్యలు ఉత్పన్నమయినప్పుడు మాత్రమే తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి స్పష్టం చేశారు.
Next Story

