Mon Feb 02 2026 03:22:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పెద్దరికం నాకు అవసరం లేదు
టాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దగా తాను వ్యవహరించదలచుకోలేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు.

ిటాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దగా తాను వ్యవహరించదలచుకోలేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తనకు ఆ పెద్దరికం అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండ్రస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు ఇష్టం లేదని చిరంజీవి చెప్పారు. ఆ స్థానం తనకు వద్దని, తాను పంచాయతీలు చేయలేనని చిరంజీవి చెప్పారు.
ఇద్దరు కొట్టుకుంటే.....
ఇద్దరు కొట్టుకుని పంచాయతీ చేయమంటే తాను చేయలేనని, చేయనని కూడా చిరంజీవి చెప్పారు. కానీ సినీ కార్మికులకు మాత్రం తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఇండ్రస్ట్రీ ఇబ్బందుల్లో ఉంటే తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అంతేకాని పెద్దగా తాను మాత్రం వ్యవహరించలేనని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ కార్మికుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

