Fri Mar 06 2026 01:56:00 GMT+0530 (India Standard Time)
తండ్రి కాబోతున్న రాంచరణ్
రామ్చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు

రామ్చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అధికారికంగా ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు తమ మొదటి బడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకు వస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులకు ఆనందం తెచ్చిపెట్టింది.
పదేళ్లవుతున్నా...
రామ్చరణ్, ఉపాసన దంపతులకు 2012లో వివాహం జరిగింది. పదేళ్లయినా పిల్లలు లేరన్న బాధ మెగా కుటుంబంలో ఉంది. దీనిపై అనేకసార్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు ఎదురైనా అందుకు ఘాటుగానే ఉపాసన స్పందించారు. ఇప్పుడు చిరంజీవి ట్వీట్ తో మెగా కుటుంబంలో చెప్పలేని ఆనందం నెలకొంది.
Next Story

