Wed May 21 2025 00:56:42 GMT+0000 (Coordinated Universal Time)
Mega Star : మెగా మూవీ రెడీ అవుతుందోచ్.. షూటింగ్ ఎప్పటి నుంచీ అంటే?
మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి మూవీకి సిద్ధమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్న చిరంజీవి కష్టపడి చిత్ర పరిశ్రమలో హీరో అయ్యారు. నిలదొక్కుకోవడమే కాకుండా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి అంటే రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించేవాళ్లు కోకొల్లలు. ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారని సంబరపడిన వారికంటే ఇక సినిమాల్లో నటించరేమో అన్న బాధ చాలా మందిలో కనిపించింది. అలాంటి మెగాస్టార్ రాజకీయాలను వదిలేసుకుని చిత్ర సీమలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.
సెకండ్ ఇన్నింగ్స్ లోనూ...
సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతున్నరు. ఆరు పదుల వయసులోనూ అందరినీ మెప్పిస్తూ, అలరిస్తూ వస్తున్న చిరు చిత్రం పై యంగ్ హీరోలకున్న క్రేజ్ నేటికీ ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే మెగాస్టార్ తో మూవీ తీయడానికి ఇప్పటికీ అనేక మంది నిర్మాతలతో పాటు, డైరెక్టర్లు క్యూ కడతారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు నిరూపించుకోవడానికి సిద్ధపడతామని, తమకు ఆ ఒక్క అవకాశమివ్వాలని కోరుకుంటారు. ఎంత మంది హీరోలతో చేసినా చిరంజీవితో సినిమా అంటే చాలు ఆ వైబ్ వేరేగా ఉంటుంది.
157 మూవీ కావడంతో...
ఇక తాజాగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి మూవీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే కథను విన్న చిరంజీవి అంగీకరించి సినిమాకు ఒప్పేసుకున్నారు. చిరంజీవి 157 మూవీ కావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదల నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్ డేట్ వచ్చేసింది. ఉగాది పండగ నాడు కొబ్బరి కాయను కొట్టి ప్రారంభించిన ఈ మూవీ చిత్రీకరణలో చిరంజీవి మే నెల నెల నుంచి ప్రారంభమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ మే మూడో వారం నుంచి ప్రారంభమై సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ కూడా నటిస్తుండటం అదనపు ఆకర్షణ. భీమ్స్ సంగీతం మరోసారి అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు.
Next Story