Fri Dec 05 2025 11:58:19 GMT+0000 (Coordinated Universal Time)
Peddi Movie Update : పెద్ది మూవీపై లేటెస్ట్ అప్ డేట్... మెగా ఫ్యాన్స్ కు పండగేనట
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుంది. రామ్ చరణ్ పై పాటలను చిత్రీకరిస్తున్నారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుంది. రామ్ చరణ్ పై పాటలను చిత్రీకరిస్తున్నారు. పెద్ది మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ బయటకు వచ్చింది. రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉండేందుకు దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేశారు. నిన్నమొన్నటి వరకూ హైదరాబాద్ లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ షూటింగ్ ఇప్పుడు మైసూరుకు షిఫ్ట్ అయింది. అదే సమయంలో స్పోర్ట్స్ కథాంశంగా ఉత్తరాంధ్ర ప్రాంత నేపథ్యమున్న చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య...
పెద్ది మూవీపై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా సంగీతం రెహ్మాన్ అందిస్తున్నారు. ఇందులో పాటలు కూడా ఒక ఊపు ఊపుతాయని త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ను విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ కు తీపి కబురు అందించారు. రెహమాన్ అందించిన సంగీతంతో ఈ పాట మామూలుగా లేదని, మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరినీ అలరించే విధంగా పాటలున్నాయని ఆయన తెలిపి మరింత బజ్ ను క్రియేట్ చేశారు.
మైసూరులో చిత్రీకరణ...
ప్రస్తుతం పాటల చిత్రీకరణ మైసూరులో జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. పెద్ది మూవీ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలన్న ఉద్దేశ్యంలో దర్శకుడు బుచ్చి బాబు ఉన్ారు. యాక్షన్ సీన్స్ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకోనున్నాయి. రామ్ - లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ అందరిని కట్టిపడేస్తుందంటున్నారు. మరి పెద్ది మూవీ పై పెట్టుకున్న అంచనాలను బుచ్చిబాబు ఏ మేరకు నిజం చేస్తాడన్నది చూడాలి.
Next Story

