Fri Dec 05 2025 16:24:14 GMT+0000 (Coordinated Universal Time)
Viswambhara : దసరా పండగకు సందడి చేయనున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్ డేట్ ఏదీ మేకర్స్ ఇవ్వడం లేదు. దీంతో మెగా అభిమానులు ఎన్ని రోజులు మూవీని ఆపుతారంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. విశ్వంభర మూవీపై మంచి అంచనాలున్నాయి. విశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. పోస్టు ప్రొడక్షన్ పనులే మిగిలిపోయాయి.
సంక్రాంతికి అనుకున్నా...
అయితే విశ్వంభర మూవీని తొలుత మొన్న సంక్రాంతికి విడుదల చేద్దామని భావించినా అప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండటంతో దానిని వాయిదా వేస్తున్నట్లు టాక్ వచ్చింది. జనవరి నెల గడచి దాదాపు ఐదు నెలలు అవుతున్నప్పటికీ విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ పై అప్ డేట్ ను నిర్మాతలు కానీ, డైరెక్టర్ కానీ ఇవ్వలేకపోతున్నారు. అయితే విశ్వంభర మూవీకి సంబంధించి సీజీ వర్క్క్ సరిగా లేదని, తిరిగి చేయించాలన్న భావనతోనే వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్...
మెగాస్టార్ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బద్దలు కొట్టడం ఖాయమన్ననమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు మాత్రం నిత్యం నిరాశ ఎదురవుతుంది. విడుదల తేదీని త్వరగా ప్రకటించాలని కోరుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం తేదీ ప్రకటించడానికి ముందుకు రావడం లేదు. అందుతున్న సమాచారం మేరకు జులై 24వ తేదీన విశ్వంభర విడుదలవుతుందని వచ్చిన సమాచారంపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ నాటికి అంటే దసరా పండగకు వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story

