స్టార్ హీరోలని అలా అనేసిందా!!
తమిళనాట బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ ఈమధ్యన సంచలనాలకు నెలవుగా మరింది. మొన్నటికి మొన్న హీరోయిన్ త్రిష విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. త్రిష కి [more]
తమిళనాట బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ ఈమధ్యన సంచలనాలకు నెలవుగా మరింది. మొన్నటికి మొన్న హీరోయిన్ త్రిష విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. త్రిష కి [more]
తమిళనాట బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ ఈమధ్యన సంచలనాలకు నెలవుగా మరింది. మొన్నటికి మొన్న హీరోయిన్ త్రిష విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. త్రిష కి కుల పిచ్చి అని, తనకు ఎదగడం కోసం తనలాంటి ఆర్టిస్ట్ లను ఎదగనియ్యదని, ఇండస్ట్రీలో తనని తొక్కేయ్యడానికి త్రిష ప్రయత్నించింది అంటూ మట్లాడిన మీరా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోస్ మీద నోరు పారేసుకుంది. అభిమానులను కంట్రోల్ చెయ్యలేని హీరోలు మీరు ఒక హీరోలైన అంటూ మాట్లాడడమే కాదు.. వాళ్ళు గాజులు తోడుకున్నారంటూ హాట్ హాట్ వ్యాఖ్యలతో అగ్గి రాజేసింది.
తమిళంలో స్టార్ హీరో విజయ్ కున్న ఫాన్స్ మరే హీరోకి లేరంటే అతిశయోక్తి లేదు. కోలీవుడ్ లో రజిని తర్వాత నెంబర్ వన్ హీరో చైర్ కోసం అజిత్ ఫాన్స్, విజయ్ ఫాన్స్ ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారు. ఇక హీరో సూర్య కూడా డీసెంట్ గా తన పని తాను చేసుకోవడమే కాదు… నాలుగురికి ఆదర్శంగా ఓల్డేజ్ హొమెస్ అలాగే అనాధ ఆశ్రమాలకు బాగా హెల్ప్ చేస్తుంటాడు. అలాంటి హీరో సూర్య మీద స్టార్ హీరో విజయ్ ని కూడా మీరా తన మాటల్తో ఆడుకుంది. వీరు నేపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని.. సొంత అభిమానులను కూడా కంట్రోల్ చేసే శక్తి కూడా వీరికి లేదని… చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని మండిపడింది. మరి మీరా చేసిన వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపాయి. మీరా వ్యాఖ్యలను సినీ ప్రముఖులు సైతం తప్పుపడుతున్నారు.
మరి మీరా వ్యాఖ్యలకు హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తక్కువ స్థాయి వ్యక్తులు చేసే విమర్శలపై స్పందిస్తూ.. అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పడమే కాదు విలువైన ఆ సమయాన్ని సమాజం కోసం వినియోగించాలని సూచించాడు. ఈ విషయంలో తనకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు .
- Tags
- Meera Mithun