Sat Dec 07 2024 21:06:45 GMT+0000 (Coordinated Universal Time)
మొదటి రోజు కలెక్షన్స్.. డిజాస్టర్ గా నిలిచిన మట్కా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి అనుకున్నంత బజ్ కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు కాస్త కాంట్రవర్సీని క్రియేట్ చేసినా సినిమాకు అది ప్లస్ అయితే కాలేదు. ఇక సినిమా విడుదలైంది. అయితే సినిమాను చూసిన ప్రేక్షకులు, విమర్శకులు పెదవి విరిచారు.
40 కోట్లకు పైగా ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ చిత్రంగా భావించారు. కానీ మంచి బజ్ క్రియేట్ చేయడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద పూర్తిగా క్రాష్ అయ్యింది. ఓపెనింగ్ రోజు మట్కా దారుణమైన ఫలితాలను చూసింది. గత కొన్నేళ్లుగా పెద్ద డిజాస్టర్లు చవిచూసిన వరుణ్ తేజ్ తన కెరీర్ బెస్ట్ డిజాస్టర్ కావడం ఖాయంగా తెలుస్తోంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ మార్నింగ్ షోల నుండి దారుణంగా పడిపోయింది. ఫుల్ రన్లో మట్కా షేర్ 1 కోటి లోపే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా డిజాస్టర్‌గా మారబోతుందని అంచనా వేస్తునానరు. వరుణ్ తేజ్ మార్కెట్ ను చూసి కూడా 40 కోట్ల బడ్జెట్ పెట్టారన్నది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.
Next Story