Fri Jun 20 2025 09:56:20 GMT+0000 (Coordinated Universal Time)
మాస్ మహారాజ్ బర్త్ డే ట్రీట్.. న్యూ అప్ డేట్స్ రెడీ
రవితేజ ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించి కొత్త అప్ డేట్స్

మాస్ మహారాజ్ రవితేజ.. రేపు (జనవరి 26) 54వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని ముచ్చటగా.. మూడు సినిమాల కొత్త అప్ డేట్లతో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. రవితేజ ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించి కొత్త అప్ డేట్స్ తో పాటు.. మరో సినిమా ధమాకా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు.
రమేష్ వర్మ దర్శకత్వంలో డ్యూయెల్ రోల్ చేస్తున్న 'ఖిలాడి' నుండి రేపు ఉదయం 10.08 గంటలకు ఫుల్ కిక్కు అనే పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' గ్లింప్స్ ను మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే సాయంత్రం 4:05 గంటలకు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్న 'ధమాకా' (గ్లింప్స్) మూవీ అప్డేట్ రాబోతుంది. రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు', 'రావణాసుర' సినిమాల నుండి బర్త్డే పోస్టర్లు రిలీజ్ చేస్తారని సమాచారం.
News Summary - Mass Maharaj Raviteja Birthday Treet to Fans
Next Story