Sun Dec 08 2024 05:47:19 GMT+0000 (Coordinated Universal Time)
ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మంచు విష్ణు ట్విస్ట్ అదిరిపోయిందంటున్న నెటిజన్లు
ఆ వీడియోలో మంచు మోహన్ బాబు, విష్ణుభార్య విరానికా రెడ్డి కూడా కనిపించారు. ఏవో పూజలు, మీటింగ్స్ లో పాల్గొన్న క్లిప్పింగ్స్
ఇటీవల మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయింది. కాసేపటికే ఆ వీడియోని ఆయన డిలీట్ చేసినా.. ట్రోలర్స్ మాత్రం దానిని ముందే సేవ్ చేసుకుని మరీ విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ వీడియోలో మంచు విష్ణు ఎవరితోనే గొడవపడుతూ కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోను బేస్ చేసుకునే మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ.. #HouseOfManchus అంటూ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోలో మంచు మోహన్ బాబు, విష్ణుభార్య విరానికా రెడ్డి కూడా కనిపించారు. ఏవో పూజలు, మీటింగ్స్ లో పాల్గొన్న క్లిప్పింగ్స్ ఆ వీడియోకి యాడ్ చేసి చివర్లో.. Indias Biggest Reality Show #HouseOfManchus అని ప్రకటించారు. ఈ వీడియో చూసి .. ఏంటి అదంతా ప్రాంకా ? లేకపోతే దానిని కవర్ చేసుకోడానికి ఇలా ప్లాన్ చేశారా ? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. ట్విస్ట్ అదిరిపోయిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రియాలిటీ షో ఈ ఏడాదే స్ట్రీమింగ్ కు వస్తుందని కూడా చెప్పేశారు. ఇంతకీ ఆ రియాలిటీ షో ఏంటి ?ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం రివీల్ చేయలేదు.
Next Story