Sat Mar 07 2026 16:35:52 GMT+0530 (India Standard Time)
మంచు మనోజ్ కు కరోనా
మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన తనకు కరోనా సోకినట్లు ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు.

కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతుంది. వ్యాక్సినేషన్ రెండు డోసులు వేసుకున్న వారిని సయితం కరోనా వదిలిపెట్టడం లేదు. కరోనా నిబంధనలను ఏమాత్రం అతిక్రమించినా వైరస్ సోకుతుంది. తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన తనకు కరోనా సోకినట్లు ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు.
తనను కలసిన వారు...
గత వారం తనను కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంచు మనోజ్ కోరారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్ లో ఉన్నారు. తన పరిస్థితి బాగా ఉందని, ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచు మనోజ్ తెలిపారు.
Next Story

