Thu Mar 19 2026 11:33:22 GMT+0530 (India Standard Time)
మూవీ లవర్స్ కు గుడ్న్యూస్
మల్టీప్లెక్స్ లో ఒక రూపాయికే సినిమా టిక్కెట్ అంటూ బంపర్ ఆఫర్ ను యాజమాన్యం ప్రకటించింది.

హైదరాబాద్ లోని మూవీ లవర్స్ కు ఒక మల్టీప్లెక్స్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మల్టీప్లెక్స్ లో ఒక రూపాయికే సినిమా టిక్కెట్ అంటూ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. హైదరాబాద్ లోని మౌలాలీలో కొత్తగా మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ ను నిర్మించారు. ఈ నెల 15వ తేదీన ఈ థియేటర్ ప్రారంభమవుతుంది. రూపాయికి అసలు విలువ ఉందా? రూపాయికి మామూలు థియేటర్లలోనూ సినిమా చూడలేం. అలాంటిది ఏకంగా మల్టిప్లెక్స్ లో ఈ ఆఫర్ ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు.
ఒకే రోజు 11 సినిమాలు...
అయితే ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం మూవీ టిక్కెట్ ధర రూపాయి మాత్రమేనని ప్రకటించింది. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ రోజున మొత్తం 11 సినిమాల వరకూ ప్రదర్శించనున్నామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. మల్టిప్లెక్స్ లో సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చవుతుంది. ఒక కుటుంబం సినిమా మల్టీప్లెక్స్ లో చూడాలంటే మూడు నుంచి నాలుగువేలు ఖర్చవుతుంది. కేవలం రూపాయితోనే సినిమా చూసే అవకాశాన్ని థియేటర్ యాజమాన్యం కల్పించింది. దీంతో ఆరోజు సినిమాలు చూసేందుకు మూవీ లవర్స్ క్యూ కడతారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
Next Story

