Mon Oct 14 2024 05:15:55 GMT+0000 (Coordinated Universal Time)
Malaika Arjun: ఇద్దరికీ బ్రేకప్ అన్నారు.. ఒకే చోట కనిపించారే!!
బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారంటూ
బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారంటూ గత కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. పలు రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ జంట ఓ ఫ్యాషన్ షోలో కలిసి కనిపించారు. డిజైనర్ కునాల్ రావల్ కు సంబంధించిన హై-ప్రొఫైల్ ఫ్యాషన్ ఈవెంట్లో వీరిద్దరూ కనిపించారు. ఈ ఈవెంట్ సందర్భంగా, మలైకా అరోరా, నటుడు రాహుల్ ఖన్నాతో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. మరోవైపు అర్జున్ కపూర్ ఒంటరిగా ర్యాంప్ వాక్ చేశాడు. ఒకే వేదికను పంచుకున్నప్పటికీ, ర్యాంప్ వాక్ చేసినప్పుడు కానీ.. కూర్చున్నప్పుడు కానీ ఇద్దరూ దూరాన్ని కొనసాగించారు.
మలైకా-అర్జున్ కపూర్ విడిపోయారంటూ చాలా రోజుల పాటు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ పబ్లిక్ లో కనిపించారు. తమ బ్రేకప్ గురించి మలైకా, అర్జున్ ఇద్దరూ మాట్లాడలేదు. మలైకా అరోరా వయసు 50 సంవత్సరాలు. ఆమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను 1998లో పెళ్లి చేసుకుంది. 2017లో విడాకులు తీసుకుని ఈ జంట. అర్జున్ కపూర్ వయసు 39 సంవత్సరాలు. అర్జున్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
Next Story