Fri Dec 05 2025 23:48:59 GMT+0000 (Coordinated Universal Time)
Raviteja : మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...ఫుల్లు మీల్సేనట
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర మూవీకి సంబంధివచి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర మూవీకి సంబంధివచి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. రవితేజ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ను ఇచ్చే సినిమాగా తెరకెక్కనుంది. రవితేజ సినిమాలంటే కామెడీ, యాక్షన్ తో పాటు అన్ని రకాలతో ఫుల్లు మీల్స్ దొరకుతుంది. ఎనర్జిటిక్ హీరోగా పేరున్న రవితేజ సీనియర్ హీరోలు, ఇటు కుర్ర హీరోలకు పోటీగా నటిస్తూ తన మూవీలను బాక్సాఫీస్ వద్ద షేక్ ఆడిస్తున్నాడు. మన ఇంట్లో వాళ్లు మాట్లాడిన మాటల తీరుతో రవితేజ అందరినీ ఆకట్టుకోవడంతో ఆయన అందరివాడిగా మారారు.
లుక్, డైలాగ్స్ తోనే...
అలాంటి రవితేజ లేటుగా టాలీవుడ్ లోకి సైడ్ యాక్టర్ గా ప్రవేశించినా తర్వాత తన లుక్, డైలాగ్స్, ఎనర్జీతో హీరోగా నిలదొక్కుకున్నాడు. రవితేజ మూవీ అంటే మినిమం హిట్ అని నిర్మాతలు కూడా భావించబట్టే ఆయన నిరంతరం వరస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రవితేజ నటించిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రాజమౌళి విక్రమార్కుడు, పూరీజగన్నాధ్ ఇడియట్ సినిమాలతో మరింత నిలదొక్కుకున్న ఈ మాస్ మహారాజా టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా చెలామణి అవుతున్నాడు.
ఈ నెల 27వ తేదీన...
రవి తేజ కొత్త దర్శకులకు కూడా అవకాశం కల్పించడంలో ముందుంటాడు. అయితే మాస్ జాతర తో ఈ నెల 27వ తేదీన రవితేజ ప్రేక్షకులకు ఫుల్లు కిక్కు ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మాస్ జాతర సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన టీజర్ నేడు విడుదలయింది. నాకంటూ ఒక చరిత్ర ఉంది అంటూ డైలాగ్ తో రవితేజ మరింత అలరించాడు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story

