Mon Oct 07 2024 15:19:51 GMT+0000 (Coordinated Universal Time)
బీస్ట్ మోడ్ లో భీమ్.. మూడ్రోజుల్లో ట్రైలర్
ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో జూ.ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు.
నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్), రామ్ చరణ్ తేజ్ లు మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. సినిమా షూటింగ్ పూర్తికాకపోవడం.. ఆ తర్వాత విడుదల చేయాలన్నా కరోనా కారణంగా అడ్డంకులు రావడంతో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు 2022, జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలై రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ లోగా ఇటు ఎన్టీఆర్, అటు మెగా అభిమానులను, సినీ ప్రియుల దృష్టిని తమవైపుకు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది చిత్రయూనిట్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు వరుస అప్డేట్లతో ఫ్యాన్స్ ను అలరించనుంది.
మూడు రోజుల్లోనే...
మరో మూడ్రోజుల్లో సినిమా ట్రైలర్ విడుదల చేయనుంది చిత్ర బృందం. దానికోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. రాజమౌళి సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక ఈ రోజు అప్ డేట్స్ విషయానికొస్తే.. సోమవారం ఉదయం "కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్" అనే ట్యాగ్ తో ఎన్టీఆర్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో జూ.ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లో ఎంతో రౌద్రంగా కనిపిస్తున్నాడు. దీనిని బట్టి ఎన్టీఆర్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సాయంత్రం రామ్ చరణ్ పోస్టర్...
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. బహుశా ఆ పోస్టర్ ను రామరాజు ఫర్ ఆర్ఆర్ఆర్ అనే ట్యాగ్ తో విడుదల చేయవచ్చని అభిమానుల అంచనా. ఆ పోస్టర్ ను చూడాలంటే మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే. కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన "ఊర నాటు " లిరికల్ వీడియో సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది.
- Tags
- rrr
- junior ntr
Next Story