Sun Mar 15 2026 15:45:27 GMT+0530 (India Standard Time)
రాధేశ్యామ్ రిలీజ్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే
రాథేశ్యామ్ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. మార్చి 11వతేదీన రాథేశ్యామ్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు

వరసగా తెలుగు సినిమాలు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే RRR, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాల తేదీలను మేకర్స్ ప్రకటించారు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటం, థియేటర్లు పూర్తిశాతం ఆక్యుపెన్సీ వస్తుందన్న ఆశతో అనేక సినిమాలు విడుదల తేదీని ప్రకటించాయి.
మార్చి 11వ తేదీన....
ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాథేశ్యామ్ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. మార్చి 11వతేదీన రాథేశ్యామ్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీ కావడంతో వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు.
Next Story

