Fri Dec 19 2025 02:24:06 GMT+0000 (Coordinated Universal Time)
మేజర్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. దేనిలో..?
అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది.

అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమా 3 జూన్ 2022న విడుదలైంది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, సాయి మంజ్రేకర్, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. వెండితెరపై సందడి చేసిన ఈ సినిమా ఇక ఓటీటీలో కూడా సత్తా చాటడానికి సిద్ధమైంది.
నెట్ఫ్లిక్స్లో జూలై 3 నుండి 'మేజర్' చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో విడుదలైన 30రోజులకు డిజిటల్లో విడుదలవుతుంది. బయోగ్రాఫీకల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
'మేజర్' 26/11 ముంబై తాజ్ దాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఇందులో చూపించారు. అతని చిన్ననాటి నుండి 2008లో ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో కమాండింగ్ ఆఫీసర్గా మారడం వరకు ఎంతో గొప్పగా సినిమాను చూపించారు. 26 నవంబర్ 2008 రాత్రి ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల సమయంలో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో అనేక మంది బందీల ప్రాణాలను రక్షించేందుకు ఉన్నికృష్ణన్ చేసిన బలిదానం కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ సినిమాను చూసిన ఎంతో మంది చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మందికి ఈ సినిమా చేరబోతోంది.
News Summary - sesh adivi major movie release date confirmed
Next Story

