రాజమౌళి – మహేష్ కాంబో లేట్ అయ్యేలా ఉందే!!
రాజమౌళి – మహేష్ కాంబో RRR కన్నా ముందే పట్టాలెక్కాల్సింది. కానీ ఇద్దరూ బిజీగా ఉండడంతో.. RRR తర్వాత మహేష్ తో సినిమా చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు [more]
రాజమౌళి – మహేష్ కాంబో RRR కన్నా ముందే పట్టాలెక్కాల్సింది. కానీ ఇద్దరూ బిజీగా ఉండడంతో.. RRR తర్వాత మహేష్ తో సినిమా చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు [more]
రాజమౌళి – మహేష్ కాంబో RRR కన్నా ముందే పట్టాలెక్కాల్సింది. కానీ ఇద్దరూ బిజీగా ఉండడంతో.. RRR తర్వాత మహేష్ తో సినిమా చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. రాజమౌళి RRR ఫినిష్ కావడం, మహర్షి – పరశురామ్ సర్కారు పాట పూర్తి కావడం ఒకేసారి జరుగుతాయి.. అప్పుడూ రాజమౌళి – మహేష్ కాంబో పట్టాలెక్కుతోంది అనే ఊహలోనే అందరూ ఉన్నారు. రాజమౌళి మహేష్ తో మూవీ RRR తరవాత పక్కా అన్నాడు. మహేష్ కూడా రాజమౌళి తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన రాజమౌళి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ కూడా చేసాడు.
అయితే తాజాగా మహేష్ – రాజమౌళి కాంబో మూవీ లేట్ అయ్యేటట్లుగా కనబడుతుంది. కారణం కరోననే.ఆ మిటి కరోనా ఇప్పుడొస్తే మహేష్ – రాజమౌళి మూవీకి ఏమైంది అనుకుంటున్నారా..కరోనా వలన RRR మూవీ అర్దాంతరంగా ఆగిపోతే.. మహేష్ ససర్కారు వారి పాట అసలు పట్టాలెక్కనే లేదు. మరి RRR కరోనా వ్యాక్సిన్ వచ్చాక మొదలైన.. ఆ సినిమా విదులయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఈలోపు మహేష్ కూడా వ్యాక్సిన్ వచ్చాక సర్కారు వారి పాటని వేగంగా పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు. దానితో మహేష్ ఫ్రీ అయినా రాజమౌళి ఫ్రీ అవడు. అందులోని రాజమౌళి సినిమా తీసాక మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాకే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కూర్చుంటాడు. సో మహేష్ మూవీ అలా లేట్ అవుతుంది. అయితే ఈలోపు మహేష్ మరో దర్శకుడితో సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడట.