మహేష్ కి ఓ క్లారిటీ ఉందండి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా [more]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా [more]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసారు. అలాగే క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చెయ్యాలని.. భారీ బడ్జెట్ లో హిస్టారికల్ ఫిలిం చేసున్నాడు. ఇక బన్నీ – సుకుమార్ లు కూడా పాన్ ఇండియా మార్కెట్ ని వదిలేలా లేరు.. అదే పట్టుదలతో పుష్ప ని టార్గెట్ చేసారు. ఇలా స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ వైపు వెళుతుంటే సూపర్ స్టార్ మహేష్ మాత్రం పాన్ ఇండియా విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. అది ఎందుకు అనేది అభిమానులకి అర్ధం కాలేదు. ట్రేడ్ కి అర్ధం కాలేదు. కానీ నిజానికి ఏమిటంటే.. మహేష్ కి పాన్ ఇండియా ప్రాజెక్ట్ మీద స్పష్టమైన అవగాహన ఉంది.
సర్కారు వారి పాట సినిమా తర్వాత రాజమౌళి తో చెయ్యబోయే సినిమా పాన్ ఇండియా ఫిలిం అవుతుంది. రాజమౌళి సినిమాతోనే మహేష్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. అది నాట్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ.. పాన్ వరల్డ్ మూవీ కాబోతుంది. అందుకే మహేష్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు కాబట్టే.. ఆ సినిమాకి సంబంధించి మహేష్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కంగారు పడడం లేదు. తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం లేదు. మహేష్ ప్లానింగ్ వర్కౌట్ అయితే మాత్రం.. మనం మాములుగా మహేష్ హాలీవుడ్ హీరోల ఉన్నాడు అనుకుంటున్నాం కానీ.. రాజమౌళి సినిమాతో హాలీవుడ్ రేంజ్ హీరో అయిపోతాడు.
- Tags
- mahesh babu