మహేష్ కి నచ్చిన సినిమా ఎవరు రీమేక్ చేస్తారో?
మహేష్ కరోనా లాక్ డౌన్ ని తన ఇంట్లోనే పిల్లలు గౌతం కృష్ణ, సీతార లతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. వారితో గేమ్స్ ఆడుతూ.. ఎంజాయ్ [more]
మహేష్ కరోనా లాక్ డౌన్ ని తన ఇంట్లోనే పిల్లలు గౌతం కృష్ణ, సీతార లతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. వారితో గేమ్స్ ఆడుతూ.. ఎంజాయ్ [more]
మహేష్ కరోనా లాక్ డౌన్ ని తన ఇంట్లోనే పిల్లలు గౌతం కృష్ణ, సీతార లతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. వారితో గేమ్స్ ఆడుతూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మూడు నెలలు గ్యాప్ తో కొత్త సినిమా చేస్తానని చెప్పిన మహేష్ కి సరిలేరు తర్వాత కరోనా కారణంగా ఆరు నెలల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఇక్కడితో ఆగేలా లేదు. ఎప్పటివరకు కరోనా ఉదృతి ఉంటుందో అప్పటివరకు మహేష్ సెట్స్ మీదకెళ్ళడు. పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టిన మహేష్ బాబు ఆ సినిమాతో సెట్స్ మీదకెప్పుడు వేళ్తాడో చెప్పలేని పరిస్థితి. అయితే ఈలోపు మహేష్ బాబు ఓటిటీస్ లో మంచి మంచి వెబ్ సీరీస్, అలాగే చాలా సినిమాలను వీక్షిస్తున్నాడు.
చూసిన వాటిలో బాగా నచ్చిన వాటి గురించి మహేష్ సోషల్ మీడియాలో పొగుడుతూ పోస్ట్ లు పెడుతున్నాడు. తాజాగా మహేష్ బాబు తమిళంలో ఓ సినిమాని ఓటిటి ద్వారా వీక్షించాడు. ఆ సినిమా ఈమధ్యనే ఓటిటిలో పెట్టడంతో.. మహేష్ ఆ సినిమా చూడడమే కాదు.. ఆ సినిమా సూపర్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నాడు. అదే ఓ మై కడవలె . ఈమధ్యనే ఓటిటిలో విడుదలైన ఈ సినిమాని చూసిన మహేష్ ఈ సినిమా ప్రతి సీన్ చాలాబావుంది అని.. అందరూ అద్భుతంగా నటించారని, మాటలు, దర్శకత్వం అన్ని సూపర్బ్ అంటూ… ఓ మై కడవలె టీం కి బెస్ట్ విషెస్ తెలియజేసాడు. మరి మహేష్ కి అంతగా నచ్చిన ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చెయ్యబోయే టాలీవడో హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తి స్టార్ట్ అయ్యింది. మరి ఏ భాషలో హిట్ అయినా.. ఆ సినిమా ని రీమేక్ చెయ్యాలని తెలుగు హీరోలు పోటీపడుతున్నారు. మరి మహేష్ కి నచ్చిన సినిమాని రీమేక్ చేసే హీరో ఎవరో చూడాలి.