Tue Mar 31 2026 17:29:06 GMT+0530 (India Standard Time)
డైరెక్టర్ పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్!
గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ తన తరువాత సినిమా కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఎవరితో అని [more]
గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ తన తరువాత సినిమా కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఎవరితో అని [more]

గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ తన తరువాత సినిమా కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఎవరితో అని ఫైనల్ చేయలేదు. పరశురామ్ కావాలనే ఇలా లేట్ చేస్తున్నాడు. అతను మహేష్ బాబు తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ మహేష్ ఏమో ఫుల్ బిజీ. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ తరువాత వెంటనే మరోసారి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయాలనుకుంటున్నాడు.
అయితే ఈ రెండిటికి మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే పరశురామ్ తన సినిమా లాగించేద్దాం అని పట్టుదలగా ఉన్నాడు. రీసెంట్ గా పరశురామ్..మహేష్ ని కలిసి ఓ కథ కూడా వినిపించాడట. కథ విన్న మహేష్ నీతో కచ్చితంగా సినిమా చేస్తా అని మాట ఇచ్చాడట. కాకపోతే ఆ సినిమా ఎప్పుడు అనేదే పెద్ద సమస్య. ప్రస్తుతం పరశురామ్ మహేష్ సినిమా కోసం కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. అలానే వంశీ పైడిపల్లి కూడా కథను రెడీ చేస్తున్నాడు. కాకపోతే వంశీ తన సినిమాల కథలు విషయంలో చాలా టైం తీసుకుంటాడు. వంశీ దగ్గర మహేష్ కోసం లైన్ ఉంది కానీ, దాన్ని స్క్రిప్ట్ పూర్తి చేయడానికి చాలా టైమ్ పట్టేస్తుంది. ఒకవేళ వంశీ సినిమా లేట్ అయితే ఈలోపు పరశురామ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఆ నమ్మకంతోనే డైరెక్టర్ పరశురామ్ కూడా ఉన్నారు. కాకపోతే మహేష్ – పరశురామ్ సినిమా ఓకే అయితే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా పరశురామ్ గీత ఆర్ట్స్ నుండి బయటికి వచేసాడు.
Next Story
