Thu Dec 18 2025 10:17:48 GMT+0000 (Coordinated Universal Time)
తాతయ్యా... వియ్ మిస్ యూ
మహేష్ బాబు కుమార్తె సితార ఎమోషనల్ గా ట్వీట్ ను పోస్టు చేసింది. తాతయ్యతో కలసి గడిపిన మధుర క్షణాలను సితార గుర్తు చేసుకుంది

"వీకెండ్ లో కలసి చేసిన భోజన సమయం గుర్తొస్తుంది" అంటూ మహేష్ బాబు కుమార్తె సితార ఎమోషనల్ గా ట్వీట్ ను పోస్టు చేసింది. తాతయ్యతో కలసి గడిపిన మధుర క్షణాలను సితార గుర్తు చేసుకుంది. తాతయ్య తన హీరో అంటూ ఆమె భావోద్వేగానికి గురయింది. ఇకపై వీకెండ్ లో కలసి భోజనాలు చేయడం ఉండవు అని ఆమె కన్నీటి పర్యంతమయింది.
తాతే నా హీరో...
తాత తనకు హీరో అని పేర్కొంది. ఏదో ఒకరోజు గర్వపడే స్థాయికి తాను చేరుకుంటానని ట్వీట్ చేసింది. తాతయ్యను బాగా మిస్ అవుతున్నానని భావోద్వేగానికి గురయింది. కలసినప్పుడల్లా తనను ఎంతో నవ్వించేవారని పేర్కొంది. ఇక నుంచి మీతో గడిపిన క్షణాలు జ్ఞాపకాలుగా గుర్తుండి పోతాయని సితార ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. చిన్నారి సితార పోస్టును చూసి నెటిజన్టు కూడా తమ కామెంట్స్ పెడుతున్నారు. ధైర్యం తెచ్చుకో తల్లీ అని ఆమెకు చెబుతున్నారు.
Next Story

