Tue Dec 16 2025 12:08:34 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ కు మహేష్ బాబు స్పెషల్ థ్యాంక్స్
జగన్ కు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను ఓపిగ్గా విన్నారని ట్వీట్ చేశారు.

జగన్ కు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను ఓపిగ్గా జగన్ విన్నారని మహేష్ బాబు ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను జగన్ పెద్ద మనసుతో విన్నారని మహేష్ బబాబు అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ కు పరిపూర్ణమైన అవగాహన ఉందని, వాటికి ఆయన ఖచ్చితంగా పరిష్కారం చూపుతారని మహేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రికి కూడా.....
సమావేశం సామరస్యపూర్వకంగా జరగడం వెనక మంత్రి పేర్ని నాని కృషి ఉందని మహేష్ బాబు తెలిపారు. గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన టాలీవుడ్ బృందంలో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఈ ట్వీట్ చేశారు. జగన్ సినీ పరిశ్రమ పట్ల చూపిన శ్రద్ధ పట్ల మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

